AP: గత వైసీపీ ప్రభుత్వం.. యాజమాన్య హక్కుల కల్పన(ఫ్రీ హోల్డ్) పేరుతో నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో రెండు నెలల పాటు నిలిపివేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ హయాంలో ఇందులో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలపై పూర్తి సమాచారాన్ని పంపాలని కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించింది.