దేవుదల గ్రామంలో వసంత నవరాత్రి మహోత్సవం లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి పందిరాట మహోత్సవం కలశస్థాపన నిర్వహించారు. మంగళవారం నుంచి 17 తేదీ వరకు తొమ్మిది రోజుల వరకు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం రాంచంద్ర స్వామి వారికి విశేష అర్చనలు పూజలు ఉంటాయని ఆలయ ధర్మకర్త శంభో రామకృష్ణారావు దంపతులు, ఆలయ పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ, వారి కుమారులు లక్ష్మణ శర్మ తెలిపారు.