శ్రీవారి సేవలో కూటమి అభ్యర్థి లలిత కుమారి కుటుంబ సభ్యులు

73చూసినవారు
శ్రీవారి సేవలో కూటమి అభ్యర్థి లలిత కుమారి కుటుంబ సభ్యులు
ఎస్ కోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి శ్రీవారి సేవలో తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆమె తన భర్త రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్ తో కలసి గురువారం దర్శించుకున్నారు. రాష్ట్రంలో రానున్నది కూటమి ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో లలిత కుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.