శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాజు అనే పాసింజర్ విశాఖపట్నం నుంచి విజయనగరం ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 25000 విలువచేసే మొబైల్ ఫోన్ బస్సులోని మరిచిపోయి బస్సు దిగిపోయారు. ఆ మొబైల్ ఫోన్ బస్సులో కండక్టర్ గుర్తించి సదరు డిపో స్టేషన్ మేనేజర్ కి అధికారులకు మొబైల్ ఫోన్ అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న పాసింజర్ వచ్చి అడగగా అతని యొక్క వివరాలు తెలుసుకుని మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది.