Oct 22, 2024, 12:10 IST/నిర్మల్
నిర్మల్
సారంగాపూర్: గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు
Oct 22, 2024, 12:10 IST
సారంగాపూర్ మండలం యాకరపల్లి గ్రామంలో నాలుగు సీసీ కెమెరాలను నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణ మంగళవారం ప్రారంభించారు. గతంలో ఉన్నసీసీ కెమెరాలు పని చేయకపోగా మరమ్మత్తులు చేయించి, వాటితో పాటు మరో నాలుగు సీసీ కెమెరాలు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్బంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయం అని తెలిపారు.