గంగారెడ్డిని చంపిన తర్వాత నిందితుడు పారిపోతున్న సీసీటీవీ దృశ్యాలు

2226చూసినవారు
TG: జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత త‌లెత్తింది. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. ఇదిలా ఉండగా గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడి వీడియో బయటకు వచ్చింది. హత్య అనంతరం నిందితుడు పారిపోతున్న సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్