విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో పలు అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ గ్రేడ్ వన్ పర్యవేక్షకురాలు తాడ్డి శ్రీదేవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో బుదరాయవలస కార్యకర్త పోస్టుకు బిసి కేటగిరి నుండి, శాతాంవలస సహాయకురాలు పోస్ట్ కు ఒసి (ఇడబ్ల్యు) కేటగిరి నుండి, చినపూతికవలస బిసి ఎ నుండి, పులుగుమ్మి నుండి బిసి ఇ, నుండి కుంచుగుమడాం బిసి డి కేటగిరిల నుండి దరఖాస్తులు కోరడం అయింది అని ఆమె తెలిపారు. దరఖాస్తు చేయదల్చిన అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండాలని 1. 7. 2022 నాటికి 21-35 ఏల్ల మద్య జన్మించి పదవతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు అని ఆమె తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు7 వతేది లోపు చీపురుపల్లి ప్రాజెక్టు కార్యాయానికి దరఖాస్తు చేరవేయాలి అని తెలిపారు.