విజయనగరం జిల్లా గుర్ల మండలం, ఎస్ఎస్ఆర్ పేట గ్రామ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురుని గుర్ల పోలీసులు అరెస్టు చేసినట్లు చీపురుపల్లి డిఎస్పి ఎస్.రాఘవులు తెలిపారు. గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ. గుర్ల ఎస్ఐ నారాయణరావుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో రైడ్ చేసి వారి వద్ద నుండి 2కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, రూ. 1250 నగదు, స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్ కు తరలించినట్లుగా డిఎస్పి తెలిపారు.