ఉన్న ఊరు, కన్నతల్లి ఒకటేనని వారికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేమనే పెద్దల మాటను తూచా తప్పకుండా జిల్లా టిడిపి బీసీ సెల్ కార్యదర్శి టి శ్రీనివాసరావ పాటించి చూపించారు. చీపురుపల్లి మండలం పాలవలసలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఇంటి జాగవా మీదుగా రోడ్డు వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తన ఇంటి స్థలాన్ని పంచాయతీ అభివృద్ధికి వితరణ చేశారు. దీంతో గ్రామస్తులు తమ హర్షం వ్యక్తం చేశారు.