మెరకముడిదాం గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు శనివారం మూడవ రోజు ఘనంగా జరిపారు. ఈ మేరకు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న డా. ఎస్ ఆర్ రంగనాథం, పాతూరి నాగభూషణం తదితరుల గురించి లైబ్రేరియన్ బుచ్చింనాయుడు విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయంలో స్ధానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు వ్యాచరచన పోటీలు నిర్వహించారు. జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు నవీన్ పాల్గొన్నారు.