విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండల నలుమూలల శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురష్కరించుకుని మహిళలు వేకువ ఝాము నుండి వరలక్ష్మి దేవి వ్రతం ఏర్పాట్లలో తలమునకయ్యారు. వరలక్ష్మీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిద రకాల పూలతో అలంకరించారు. అలాగే పలు రకాల పల్లను అమ్మవారికి ప్రసాదం పెట్టి వారి తహతకు తగ్గట్టుగా నూతన బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం మహిళలు భర్తకు పాదాభివందనం సమర్పించి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీ దేవికి శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తే కలకాలం మత్తైదువుగా ఉంటారని వీరికి అపారనమ్మకం.