రాజ్యాంగం తోనే భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. మంగళవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయం ఆవరణలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగంతోనే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు. జడ్పిటిసి గార తౌడు, ముత్యాల నాయుడు, బెల్లాన త్రినాధరావు పాల్గొన్నారు.