విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో ముచ్చర్ల కోటేశ్వరరావు ఇంటి పూరిల్లు ఆదివారం అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దీపారాధన అనంతరం పొలానికి వెళ్లి వచ్చే సరికి ఇల్లు పూర్తిగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. ఎలుకలు దీపవత్తులు ఎత్తుకెళ్లడం కారణమని చెప్పారు. సర్పంచ్ సూర్యనారాయణ ప్రభుత్వ సహాయం కోరగా, రూ. లక్ష నష్టం జరిగినట్లు తెలిపారు.