నేరాల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు

79చూసినవారు
నేరాల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాద నివారణ తో పాటు గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బొబ్బిలి డిఎస్పి శ్రీనివాసరావు, సీఐ ఎన్ వి ప్రభాకర్, ఎస్. ఐ మహేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్