ప్రతి మహిళ ఆర్థిక ప్రగతిని సాధించి, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహానందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసులో ఆదివారం సమగ్ర రైతు సహకార సంస్(ఇఫ్కో) ఆద్వర్యంలో స్వయం సేవక బృందాలతో సమావేశం నిర్వహించారు. ఇప్కో లాంటి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చేయూత నివ్వడం, ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం సంతోషించదగ్గ పరిణామం అన్నారు.