Oct 05, 2024, 17:10 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్: శోభాయమానంగా గంగనీళ్ల జాతర
Oct 05, 2024, 17:10 IST
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ అటవీ ప్రాంతంలో గల ఈ క్షేత్రంలో వెలసిన అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది. తిథి ముహుర్తాలతో సంబంధం లేకుండా దేవీశరన్నవరాత్రులలో వచ్చే శనివారం జాతర ప్రారంభమై అమ్మవారి ఆభరణాలను అడెల్లి పోచమ్మ ఆలయం నుండి అమ్మవారి ఆభరణాలతో బయలుదేరి శనివారం ఉదయం న్యూ సాంగ్వి గ్రామంలో గోదావరిలో శుద్ధి చేసుకొని చుట్టుపక్కల గ్రామాల వారు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి అమ్మవారి నగలకు స్వాగతం పలికారు.