అనుమానాస్పద స్థితిలో నటుడు సలీల్ తల్లి మృతి

58చూసినవారు
అనుమానాస్పద స్థితిలో నటుడు సలీల్ తల్లి మృతి
భారత మాజీ క్రికెటర్, నటుడు సలీల్ అంకోలా తల్లి మాలా అశోక్ అంకోలా (77) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పుణెలోని తన ఇంటి కిచెన్‌లో ఆమె రక్తపు మడుగులో పడి ఉన్నారు. కుటుంబికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్