నాతవరం: ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి
విద్యార్థినులను దూషిస్తున్న నాతవరం ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఎ డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ శుక్రవారం డిమాండ్ చేశారు. నాతవరంలో మాట్లాడుతూ విద్యార్థినుల చేత మరుగుదొడ్లు కడిగించడం అన్యాయమన్నారు. పురుగులు ఉన్న అన్నాన్ని పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఏ విద్యార్థి అయినా ప్రశ్నిస్తే దూషణకు దిగుతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేయాలని కోరారు.