AP: బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు పేటీ వారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై గతంలో టీడీపీ నేత గట్టు తిలక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదైంది. కాగా, 2021లో కర్లపూడి బాబు ప్రకాష్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో ఇటీవల పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేశారు.