ఫుట్‌పాత్‌లపై అక్రమ కట్టడాలను కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు (వీడియో)

1556చూసినవారు
TG: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రిపురంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను శనివారం GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. నిత్యం పాదాచారులకు, వాహనాలకు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్