పోలీసులు కొట్టారని ఆత్మహత్య

60చూసినవారు
పోలీసులు కొట్టారని ఆత్మహత్య
TG: ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఓ వ్య‌క్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ అనే వ్యక్తి తన ఫోన్ పోయిందని అల్లాదుర్గం పీఎస్‌కి వెళ్లాడు. ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించగా, కానిస్టేబుల్ సాయిలు అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన కిషన్ సూసైడ్ నోట్ రాసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్