గంట్యాడ మండలం నరవ గ్రామం లో ప్రమాదవశాత్తు చెరువు లో జారిపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. నరవ సేవాసమితి సభ్యులు, కొంత మంది ఉద్యోగస్తులు డొనేషన్ చేసిన అమౌంట్ మొత్తం రూ: 75000/- ఆ కుటుంబ సభ్యులకి అందచేయడం జరిగింది. డొనేషన్ చేసిన దాతలకు ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరికి ఎలాంటి సహాయం చేయాలన్నా నరవ సేవాసమితి మీకు అండగా ఉంటుందని వారు తెలియజేశారు.