పాలకొండలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

54చూసినవారు
పాలకొండలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
పాలకొండ శాఖ గ్రంథాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి గణేశ్ బాబు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే రాజ్యాంగాలన్నింటినీ ఆకలింపు చేసుకొని వాటిలో నుంచి మనకు ఉపయోగపడే భావనలు తీసుకున్నారని దీని ద్వారా రాజ్యాంగ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్