మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు పాలకొండ నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పాలకొండ నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.