సీతంపేట మండలం, మర్రిపాడు పంచాయతీ, ఎగువదార బంధం గ్రామంలో గిరిజన సంఘాలు నిర్వహించిన సమావేశంలో మంగళవారం జిల్లా సీపీఎం అధ్యక్షుడు ఎమ్. లక్ష్మణరావు, జిల్లా నాయకులు ఎమ్. తిరుపతి రావు హాజరయ్యారు. గిరిజన గ్రామాలకు రహదారులు, తాగునీరు, స్కూల్ భవనాలు, పక్కా గృహాలు విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీతంపేట ఐటీడీఏ వద్ద ఆందోళనలు చేపడతామని గిరిజన నాయకులు హెచ్చరించారు.