ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర సతీమణి అనూష అన్నారు. శనివారం నగరంలోని మహాత్మ జ్యోతిబాపూలే, మరో పాఠశాల విద్యార్థులకు శనివారం ఆమె నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. సుమారు 600 మంది విద్యార్థులకు అందజేసి పేరుపేరునా పలకరించి వారి వివరాలు తెలుసుకున్నారు.