విత్తన గుళికలు తయారీ విధానంపై శిక్షణా కార్యక్రమం

588చూసినవారు
విత్తన గుళికలు తయారీ విధానంపై శిక్షణా కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి గ్రామంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో విత్తన గుళికలు తయారీ విధానంపై జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రబంధకులు షణ్ముఖ రాజు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తక్కువ వర్షపాతంతో మొలకెత్తే విత్తనాలను విత్తన గుళికలుగా తయారుచేసి రైతులు నీటి వసతి లేని పొలంలో ఈ విత్తనాలను వేయడం వలన ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు ఈ విత్తన గుళికలుగా చేసిన విత్తనాలు మొలకెత్తుతాయి. ఇలా వేయడం వలన రైతుకు కొంత ఆదాయం వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సీఆర్పీలు యాండ్రాపు శ్రీరాములు, అప్పలనాయుడు, గంట తవుడు, పిరిడి అనురాధ, రమణమ్మ, ఉర్లక నాగార్జున మరియు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్