
పార్వతీపురంలో కుటుంబ్ ఐ వి ఎఫ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
పార్వతీపురం పట్టణంలో ఆదివారం ప్రముఖులు, నాయకులతో కలిసి కుటుంబ్ ఐ వి ఎఫ్ సెంటర్ ను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఐ వి ఎఫ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ఆనందదాయకం అని అన్నారు. సంతానలేమి ఉన్నవారికి మంచి వైద్యం అందించాలని సూచించారు. ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ డాక్టర్ రోజా దంపతులను ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.