పాచిపెంట మండలం చొక్కాపు వాని వలసకు చెందిన కోట నందీశ్వరరావు(21)సాలూరు మండలం జీగిరాం గ్రామ సమీపంలోని కొల్లి నారాయణ రావు మామిడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ గురువారం సాయంత్రం తెలిపారు. మృతుడికి ఐదేళ్ల క్రితం నందినితో వివాహం జరగ్గా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతుడు వేరే అమ్మాయి ప్రేమలో పడి, మందుకు బానిసైనట్టు స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.