మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఆదివారం షార్ట్ సర్క్యూట్తో ఓ పెంకుటిల్లు దగ్ధమయ్యింది. గ్రామంలోని కొవ్వాడ వెంకటరమణ చెందిన పెంకుటిల్లు విద్యుత్ షార్ట్ కట్ తో ఒక్కసారిగా పొగలు కమ్ముకొని మంటలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు పొలం పనులు నిమిత్తం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిపోయారు. ఇంటి సామాగ్రి ఇంట్లో సర్టిఫికెట్స్ అదేవిధంగా నగదు రూ.3.5లక్షలు, బంగారం ఆరు తులాలు, ఇంటి సామాగ్రి బూడిదపాలైంది.