అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన విశాఖలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సాలూరుకు చెందిన ఈశ్వరరావు(38) కొన్నేళ్ల క్రితం విశాఖ వెళ్లారు. సీతంపేటలో కేటరింగ్ వ్యాపారుల దగ్గర పని చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజలురోజులు క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం ఓ దుకాణం వద్ద పడుకొని మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద స్థితిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.