ప్రేక్షకులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

84చూసినవారు
ప్రేక్షకులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఎస్. కోట గ్రామదేవత శ్రీ ధార గంగమ్మ తల్లి మారు పండగ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక కాలేజీ గ్రౌండ్లో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన విశాఖ రైడర్స్ డాన్స్ బేబీ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత నెలలో ఈ పండుగ నిర్వహించిన సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం తెలిసిందే. ఈ మేరకు మారు పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.