ఉత్తరాపల్లి గ్రామంలో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

679చూసినవారు
ఉత్తరాపల్లి గ్రామంలో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
కొత్తవలస మండలం, ఉత్తరాపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో గల ఉత్తరాపల్లి గ్రామం, మరిడిమాంబ కాలనీ, గాంధీనగరం లో కరోనా మహమ్మారి వలన ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల గ్రామ ప్రజలు నిత్యావసర వస్తువుల దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున గ్రామంలో ఉన్న 500 కుటుంబాలుకు 70 వేల రూపాయలు విలువ గల కూరగాయలు, కోడి గ్రుడ్లు ఎస్. కోట మాజీ శాసనసబ్యులు అయిన కోళ్ళ లలిత కుమారి ,మండల మాజీ జడ్పీటీసీ కోళ్ళ శ్రీను గారు మండల మాజీ సర్పంచ్ గోరపల్లి రాము,జిల్లా మాజీ రైతు అధ్యక్షులు తిక్కన చిన దేముడు, స్థానికి మాజీ ఎంపీటీసీ సబ్బవరపు అప్పారావు గ్రామ మాజీ వైస్ సర్పంచ్ దొర అప్పలరాజు ,స్థానిక టీడీపీ నాయకులు చేతులు మీదగా పంపిణి చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు మిడతాన నాయుడు, ఉపాధ్యక్షుడు యస్.వి ప్రకాష్,ప్రధాన కార్యదర్శి గాడి ప్రసాద్ , టీడీపీ యూత్ కమిటీ సబ్యలు గ్రామ టీడీపీ మహిళ కమిటీ సభ్యలు, గ్రామ టీడీపీ రైతు కమిటీ అధ్యక్షుడు రెడ్డి రాము గ్రామ జనసేన అధ్యక్షుడు ఎర్నిబాబు , టీడీపీ సీనియర్ కార్యకర్తలు, టీడీపీ కుటుంబ సభ్యులందరు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :