జామి మండల కేంద్రంలో జరుగుతున్న హౌస్ హోల్డ్ సర్వేను ఎంపీడీవో అప్పలనాయుడు సోమవారం ఈఓపిఆర్డి ఉమా తో కలిసి పరిశీలించారు. త్వరితగతిన హౌస్ హోల్డ్ సర్వే పూర్తి చేసి, సర్వే నివేదికను త్వరలో సమర్పించాలని తెలిపారు. అదేవిధంగా పంచాయతీ పరిధిలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. క్లోరినేషన్ చేసిన త్రాగునీరును ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు.