ఎస్. కోట మండల కేంద్రం పోతనాపల్లి వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా టివిఎస్ ఎక్సెల్ ఢీ కొనడంతో చనిపోయిన ఘటన సోమవారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాహు ప్రకాష్(60) రోడ్డు దాటుతుండగా అదే మండలానికి చెందిన వ్యక్తి టీవీస్ పై వచ్చి వెనక నుండి బలంగా ఢీకొట్టాడు. స్థానికులు వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించినట్లు పోలీసులు తెలిపారు.