విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

54చూసినవారు
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, 30న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. సెప్టెంబరు 3న కౌంటింగ్ చేపట్టనున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు. కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. త్వరలో ప్రకటించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్