TG: సిద్దిపేట పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరై బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి 2500 ఇస్తానని మాట తప్పిండని అన్నారు. బతుకమ్మ చీరలు, తులం బంగారం ఎగ్గొట్టిండని.. పాత పథకాలు బంద్ అయిపోయాయ్, కొత్త రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు.