ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో పడి ఉన్న నవజాత శిశువు కనిపించింది. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెలకొంది. శిశువు ఏడ్చినప్పుడు చుట్టుపక్కల వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం శిశువుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నవజాత శిశువు చికిత్స పొందుతూ మృతి చనిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.