భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ అనుకోకుండా దేశ తొలి ప్రధాని అయ్యారని అన్నారు. ఆయన స్థానంలో.. సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లు ఆ పదవికి అర్హులని పేర్కొన్నారు. హర్యానాలోని రోహ్‌తక్‌లోని ఓ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.