AP: తిరుమల తొక్కిసలాట ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 'దైవ సన్నిధిలో చనిపోవడం ఒక రకంగా అదృష్టమే. అయితే ముక్తి కోసం వెళ్లి ప్రాణాల్ని విడిచారు' అని అన్నారు. దీంతో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అలా ఎలా మాట్లాడతారని ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.