సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

60చూసినవారు
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేది తన సంకల్పమని పేర్కొన్నారు. స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్