జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం చేనేత శారీ వాక్ నిర్వహించారు. ఆర్కే బీచ్ వేదికగా జరిగిన వాక్‌లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మంత్రి అనిత హాజరయ్యారు. వీడెంటల్, వీ హెల్త్‌కేర్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చేనేత వస్ర్తాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.