విశాఖ: "విజయసాయి చట్టం నుంచి తప్పించుకోలేరు"
విజయసాయిరెడ్డి హయాంలో విశాఖ వాసులు పడిన ఇబ్బందులను మర్చిపోలేమని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మునిగిపోయే నావ అని తాను ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. ఇప్పుడు అది నిజం అవుతోందని.. విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు.