బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్‌లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. శుక్రవారం విశాఖలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ. పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు. జీవీఎంసీ గాంధీ పార్క్‌లో మౌన దీక్ష చేపట్టారు.