మండల కేంద్రమైన రావికమతం లో శనివారం పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రావికమతం పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సబ్ ఇన్స్పెక్టర్ జి. ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఎస్సై మహేశ్వర రావు మాట్లాడుతూ విధినిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ అశువులు బాసిన పోలీస్ అమరవీరులకు జోహార్లు అని అన్నారు.