
బుచ్చయ్యపేట: విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం
అనకాపల్లి జిల్లా, బుచ్చియ్యపేట మండలం పొట్టిదోరపాలెం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ వడ్డి సత్యారావు ఆధ్వర్యంలో గురువారం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు.