పుట్టినరోజు సందర్భంగా శ్రామికులకు పండ్లు మాస్కులు పంపిణీ

1354చూసినవారు
పుట్టినరోజు సందర్భంగా శ్రామికులకు పండ్లు మాస్కులు పంపిణీ
పుట్టినరోజు పండుగను అందరూ ఎంత హంగామాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్త బట్టలు కేక్ కటింగ్ ఫ్రెండ్స్ తో సంబరాలు జరుపుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకు భిన్నంగా తన కుమారుడు రెండో పుట్టినరోజును ఆడంబరాలకు దూరంగా వినూత్నంగా జరిపి పలువురికి ఆదర్శంగా నిలిచారు కొయ్యూరు మండలంలో ఎమ్మెల్వో గా పనిచేస్తున్న సాగిన లోవరాజు.

తన కుమారుడు బహుమాన్య శ్రీరామ్ పడాల్ రెండవ పుట్టినరోజును కరోనా నిబంధనలు పాటిస్తూ విభిన్న రీతిలో జరిపించాడు. చింతపల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన కుమారుడు శ్రీరామ్ పడాల్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు పులిహోర తో పాటు మాస్క లను అందజేశాడు. అలాగే పలువురు సాధువులకు పులిహోర పండ్లు మాస్కులు అందజేసి ఆశీస్సులు పొందాడు.

ఈ సందర్భంగా ఎమ్ ఎల్ వో లోవరాజు మాట్లాడుతూ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కరోనా కష్ట సమయంలో కూడా నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఇతరుల ఆరోగ్యాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు మాస్కులు అందించడం జరిగిందన్నారు. ఆడంబరాలకు దూరంగా ఇతరులకు ఉపయోగపడే విధంగా పుట్టినరోజు వేడుకలు జరిపిన నాడే పిల్లలకు చిన్నతనం నుండే శ్రమ విలువ మానవత్వం విలువ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్