కృత్రిమ మేధ (AI) ఆవిష్కరణల రంగంలో భారత్ చొరవ చూపాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. పెట్టుబడులనేవి దీనికి అవరోధంగా ఉందని, అయితే.. విస్తృత పరిశోధనల సాయంతో ఖర్చును తగ్గించుకోవడం ఓ పరిష్కార మార్గమని ఆయన వెల్లదించారు. కృత్రిమ మేధ రంగంలో అతిపెద్ద పురోగతి చోటుచేసుకుందని తాను అనుకోవడం లేదని.. మనం ఒక్క గణిత ఆవిష్కరణ దూరంలో ఉన్నామని, అదే జరిగితే మొత్తం పరిస్థితులే మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు.