'భారత మహిళా స్వాతంత్ర ప్రదాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్'

270చూసినవారు
'భారత మహిళా స్వాతంత్ర ప్రదాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్'
గూడెం కొత్త వీధి మండలం: ఆధునిక భారతదేశ నిర్మాత, భారత మహిళా స్వాతంత్ర ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జన్మదిన సందర్భంగా గురువారం రింతాడ గ్రామంలో ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్ ఇంటి వద్ద మహిళలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా ఫూలే-అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదనంతరం ఉప సర్పంచ్ మహిళలకు జాకెట్ వస్త్రాలు పంపిణీ చేస్తూ, వేదకాలం కాలం నుంచి అజ్ఞానంలో, అభద్రతలో ఉంచి, హక్కులు లేకుండా క్రూరంగా అణిచివేసిన భారత స్త్రీలకు తన విధానాల ద్వారా స్వేచ్ఛ స్వాతంత్య్రాము మరియు పరిపాలనపరంగా స్త్రీల అభివృద్ధిని కేవలం రాజకీయ, ఆర్థిక కోణంలోనే కాక ఆరోగ్య కోణంలో చూసిన గొప్ప మానవతావాది, చిరస్మరణీయుడు డాక్టర్ అంబేద్కర్. సమాజప్రగతి ఆ సమాజంలోని స్త్రీల స్థితిపై ఆధారపడుతుందన్నాడు.

స్త్రీ హక్కుల కోసం పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్లు రూపొందించిన ప్రవేశపెట్టగా ఆమోదించకపోవడంతో తన న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా అంబేద్కర్ రాజీనామా చేశారు. కావున మహిళల కోసం తన అత్యున్నతమైన పదవిని వదులుకొని త్యాగం చేసిన మహనీయుడు అడుగుజాడలో నడుచుకుంటూ భావిభారత పౌరులకు, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని మహిళలకు విలువైన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్