మధ్యాహ్న భోజన, సానిటేషన్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని సిఐటియూ ఆధ్వర్యంలో మంగళవారం ముంచంగిపుట్టు మండలంలోని కళ్యాణ మండపం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. సిఐటియు మండల కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన, సానిటేషన్ కార్మికులు పడుతున్న కష్టాలు, సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని కోరారు.